‘హలో గురు ప్రేమకోసమే’ కోసం డబ్బింగ్ పూర్తి చేసిన అనుపమ

  • August 30, 2018 / 06:46 AM IST

దసరా బరిలో ఉన్న సినిమాలో హలో గురు ప్రేమకోసమే ఒకటి. “సినిమా చూపిస్త మామా”, “నేను లోకల్‌” వంటి చిత్రాలతో విజయాల్ని అందుకొన్న త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తన పాత్రకు డబ్బింగ్ ని కంప్లీట్ చేసింది. “అ..ఆ” సినిమాతో అనుపమ పరమేశ్వరన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె మాతృభాష మలయాళం అయినప్పటికీ.. మొదటి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగువారి మనసు దోచుకుంటోంది.

ఈ సినిమాలోని తనదైన వాయిస్ తో కట్టిపడేయనుంది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ఉన్నది ఒకటే జిందగీ తర్వాత చేస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. అందులో నటించిన జోడీ ఇందులోనూ అలరించనుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్లోకి రానుంది. ఇందులో యువతని ఆకట్టుకునే రొమాంటిక్ సీన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎమోషల్ సీన్స్ నిండుగా ఉన్నాయని.. క్లాస్, మాస్ అని తేడా లేకుండా అందరికీ నచ్చుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus