తేజ్ తో స్టార్ డమ్ కోసం అనుపమ వెయిటింగ్

తెలుగు యువ హీరోయిన్లలో మంచి ఫాలోయింగ్ ఉన్న నటి అనుపమ పరమేశ్వరన్. ‘అ..ఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె తక్కువ కాలంలోనే హాట్ ఫేవరెట్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ‘ప్రేమమ్, శతమానం భవతి, ఉన్నది ఒక్కటే జిందగీ, కృష్ణార్జున యుద్ధం’ సినిమాల్లో నటించిన ఆమె సెటిల్డ్ పాత్రలనే చేస్తూ వచ్చారు.కానీ కొత్తగా చేసిన ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాలో మాత్రం కొత్త తరహా ఎనర్జిటిక్, చిలిపి పాత్రలో నటించారు.

నిన్న సాయంత్రం విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమాకు అనుపమ క్యారెక్టర్ హైలెట్ కానుందని, ఇన్నాళ్లు చూడని కొత్త, కొంటె అనుపమకు ఈ సినిమాలో చూడొచ్చని అర్థమైంది. అనుపమ కూడ ఈ సినిమా నటిగా తనకు మంచి బ్రేక్ ను ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కరుణాకరన్ డైరెక్ట్ చేశారు. జూలై 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపి సుందర్ సంగీతమ్ అందించిన ఈ సినిమాను కెఎస్. రామారావు నిర్మించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus