తనపై వచ్చిన వార్తలపై స్పందించిన అనుపమ పరమేశ్వరన్

మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ అతి తక్కువ సినిమాలతోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది. అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి వంటి విజయాలను అందుకున్న భామ “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” సినిమా చిత్రీకరణలో పాల్గొంటోంది. అయితే ఆమెకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చేరారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంది. దీంతో ఆమెకు ఏమైంది ? ఎలా ఉంది ? అని అభిమానులు ఆందోళన పడ్డారు. ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ విషయం అనుపమ వద్దకు వెళ్ళింది. ఆమెకు కాల్స్ ఎక్కువ రావడంతో తనపై వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

” నా హెల్త్ పై వస్తున్న రూమర్లు చూసి నేను నవ్వుకున్నాను, నేను వాస్తవానికి మొన్న షూటింగ్ లో ప్రకాష్ రాజ్ గారితో కలిసి చేసే సీన్ లో డైలాగులు చెపుతున్నపుడు.. తడపడ్డాను. ప్రకాష్ రాజ్ గారు డైలాగులు మరొకసారి చెప్పమని, మరొక టేక్ చేద్దాం అన్నారు. కాగా అప్పటికే నాకు ఉదయం నుండి కొద్దిగా జ్వరంగా, లో బిపి కూడా ఉండడంతో షూటింగ్ లో చాలా ఇబ్బందిపడడాన్ని గమనించిన యూనిట్ సభ్యులు నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి మెడిసిన్ ఇచ్చారు. అంతే తప్ప నా ఆరోగ్యానికి సంబంధించి పెద్ద ప్రమాదమేమీ లేదు” అని చెప్పుకొచ్చింది. దీంతో అనుపమ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus