అనుపమపై మళ్లీ మొదలైన డేటింగ్ గాసిప్స్

హీరో, హీరోయిన్స్ మధ్య ప్రేమ పుట్టిందనే వార్తలు ఇప్పటిదికాదు. వరుసగా రెండు, మూడు సినిమాల్లో కలిసి నటిస్తే చాలు.. వారిద్దరి మధ్య లింకులు పెట్టడం కామన్. ఇప్పటివరకు టాలీవుడ్ లో అనుష్క, ప్రభాస్ మధ్య ప్రేమ గురించే గాసిప్స్ వచ్చాయి. ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ చుట్టూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అ..ఆ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ తొలి సినిమాతోనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మరింతమంది మనసులు దోచుకుంది. అలాగే హీరోల మనసు దోచుకుందని కొంతమంది అంటున్నారు. శతమానం భవతి సినిమాలో శర్వానంద్ ని ప్రేమలో పడేసిందని వార్తాలు వినిపించాయి. ఆ వార్తల్లో నిజములేదని తెలిసేలోపు… మరో హీరో ప్రేమలో పడినట్లు గాసిప్ షికారు చేస్తోంది. ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలో రామ్, అనుపమ మధ్య ప్రేమ చిగురించిందనీ, హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో బలపడిందని చెప్పుకుంటున్నారు.

అంతేకాదు ప్రస్తుతం హలో గురూ ప్రేమ కోసమే సినిమా సక్సెస్ అయిన తరువాత సక్సెస్ టూర్లో ఉన్న రామ్, అనుపమ ఇద్దరూ ఫోనుల్లో మాట్లాడుకుంటూ బిజీగా ఉన్నారని టాక్. వీలు దొరికినప్పుడల్లా ఇద్దరూ చాటింగ్‌లు చేసేసుకుంటున్నారట. ఈ విషయాన్ని వారిని అడిగితే చిరాకు పడిపోతున్నారు. “ఏం ఫోన్లలో మీరు మాట్లాడుకోరా… చాటింగులు చేసుకోరా” అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. ఫోన్లో మాట్లాడినంత మాత్రాన లింకులు పెట్టేస్తే ఎలా? అని గట్టిగానే అడుగుతున్నారు. మరి వీరిద్దరి మధ్య ప్రేమ ఫోన్ వరకే ఆగిపోతుందా… పెళ్లి వరకు చేరుతుందో.. లేదో అనేది తెలుసుకోవాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus