దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఈ మధ్యకాలంలో పెళ్లి వార్తలు వరుసగా వినిపిస్తున్నాయి. పలువురు ప్రముఖులు ఇప్పటికే మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించగా, మరికొందరు నిశ్చితార్థాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి తాజా గాసిప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
‘ప్రేమమ్’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అనుపమ, తన సహజ నటనతో తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అయితే, వచ్చే నెలలో ఆమె నిశ్చితార్థం జరగబోతుందని, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. కాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
ఇక ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో తెగ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే వరుడని టాక్ వినిపిస్తుండగా, ఇది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన సంబంధమా అన్నది ఇంకా క్లారిటీ లేదు. కొంతకాలంగా అనుపమ వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నా, ఆమె ఎప్పుడూ స్పందించకపోవడం గమనార్హం.
మరోవైపు, యువ హీరో ధృవ్ విక్రమ్ తో రిలేషన్షిప్ తో ఉన్నట్లు వచ్చిన రూమర్స్ కూడా ఈ చర్చలకు మరింత ఊతమిచ్చాయి. సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరి పోస్టులకి ఒకరు లైక్స్ చేస్తూ కనిపించడం, ఒకే లొకేషన్లలో ఫోటోలు షేర్ చేయడం వంటి అంశాలు అభిమానుల్లో అనుమానాలను పెంచాయి. వీరిద్దరూ కలిసి చేసిన ప్రాజెక్ట్ తర్వాత ఈ వార్తలు మరింత బలపడినట్లు కనిపిస్తోంది.
అయితే ఇప్పటివరకు ఇవన్నీ కేవలం ప్రచారాలుగానే ఉన్నాయి. నిజంగా అనుపమ నిశ్చితార్థం జరగబోతుందా? వరుడు ఎవరు? అనే విషయాలపై స్పష్టత రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.