కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి మాతృభాషలో కన్నా తెలుగులోనే ఎక్కువమంది అభిమానులున్నారు. ఇప్పుడు వారంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కారణం ఏమిటంటే… మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా అనుపమ అందరినీ ఆకట్టుకుంది. తెలుగులో అ..ఆ మూవీ ద్వారా అడుగుపెట్టింది. ప్రేమమ్, శతమానం భవతి సినిమాలతో హిట్ అందుకుంది. అచ్చమైన తెలుగు అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన ఉన్నదీ ఒక్కటే జిందగీ, తేజ్ ఐలవ్యూ సినిమాలు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేకపోయాయి. అయినా ఆఫర్లు తగ్గలేదు. “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో “హలో గురు ప్రేమ కోసమే” లో హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అందుకే చిత్ర బృందం విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో డైరెక్టర్ త్రినాధరావు, అనుపమ పరువు తీశారు.
వేదికపై డైరెక్టర్ మాట్లాడుతూ.. “షూటింగ్ స్పాట్ కు మొదటిసారి అనుపమ వచ్చినప్పుడు మేకప్ లేకుండా కారు అద్దంలో నుంచి చూసి గుర్తు పట్టలేదు. ఆ తర్వాత మేకప్ తో కనిపించాక అనుపమ అని పసిగట్టాను” అని చెప్పారు. అప్పుడూ అందరూ నవ్వారు. వేదిక ఫై ఉన్న అనుపమ కాస్త నవ్వినట్లు అనిపించినా లోపల మాత్రం బాధపడినట్లు సమాచారం. అక్కడి తో ఆగకుండా “దిల్ రాజు ఆఫీస్ కు వచ్చినప్పుడు జీన్స్ ప్యాంటు టీ షర్టు వేసుకుని ఇలా నడుచుకుంటూ వచ్చావు” అంటూ అనుపమని హేళనగా ఇమిటేట్ చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే డైరక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేచురల్ బ్యూటీ అయిన అనుపమని అలా అనడం బాగాలేదని చెబుతున్నారు. దీనిపై డైరెక్టర్ త్రినాధరావు ఎలా స్పందిస్తారో చూడాలి.