కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మాయ్

సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీలు అప్పుడప్పుడు స్కిన్ షో తప్పదు అని ముందు జాగ్రత్తగా ఎల్లపుడు డైట్ లో ఉండడానికి ప్రయత్నిస్తారు. కాస్త అదుపుతప్పినా అందంలో తేడా వస్తుందని టైమ్ దొరికితే చాలు జిమ్ వర్కౌట్స్ తో బిజీగా ఉంటారు. జీరో సైజ్ నడుములకు సౌత్ ప్రేక్షకుల టెస్ట్ బావుంటుందని కొంత మంది హాట్ బ్యూటీలు ఆలోచిస్తుంటారు. అయితే గ్లామర్ గీతను దాటకుండా నవ్వుతోనే పడేసే కొంత మంది హీరోయిన్స్ మాత్రం అప్పుడప్పుడు కొంచెం బయపెడుతున్నారు. ఆ లిస్ట్ లో మొన్నటి వరకు నిత్యామీనన్ భాగనే కొనసాగింది. రీసెంట్ గా అ! సినిమాలో బొద్దుగా కనిపించి ఓ వర్గం వారికి వామ్మో..అనిపించేలా కనిపించింది. అయితే ఇప్పుడు ఆ ఛాయలు మరో వయ్యారిలో కూడా కనిపిస్తున్నాయి అనే టాక్ వస్తోంది. ఆమె ఎవరో కాదు నవ్వుతోనే కాకుండా నటనతో ఆకర్షించే అనుపమ పరమేశ్వరన్. ఈ బ్యూటీ చాలా వరకు నార్మల్ డ్రెస్సుల్లోనే చాలా అందంగా కనిపించి కవ్విస్తుంటుంది.

అయితే రీసెంట్ గా కొన్ని ఫొటో షూట్స్ లలో కూడా బాగానే పాల్గొంటోంది. ఎక్కువగా గ్లామర్ గీతను దాటకుండా అందమైన సెక్సీ గర్ల్ అనిపించేలా స్టిల్స్ ఇస్తోంది. అయితే ఆ ఫొటోలను చూసి చాలా మంది అనుపమ ఆకారం మరుతోందేంటని కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే బుగ్గల అంచున మెరుపు బాగానే ఉన్నా టోటల్ స్టిల్ చూస్తుంటే బరువు బాగానే పెరిగింది అనే అనుమానం కలుగుతోంది. ఇలానే కంటిన్యూ చేస్తే కష్టం అనుపమ. కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మరి. లావెక్కితే స్టార్ల సినిమాలు దూరమైపోతాయ్ అని చాలామంది చూశాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus