Anupama Remuneration: అనుపమ కెరీర్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఇదే..!

టాలీవుడ్ లో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ బ్యూటీ తెలుగులో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. యంగ్ హీరోల సరసన నటిస్తూ.. యూత్ లో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటివరకు అనుపమ తెరపై ఎంతో పద్దతిగా కనిపించే పాత్రల్లోనే కనిపిస్తూ వచ్చింది.

కానీ తొలిసారి ఆమె లిప్ లాక్ సీన్స్ లో నటించి షాకిచ్చింది. ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయమైన ‘రౌడీబాయ్స్’ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు అందులో అనుపమ లిప్ లాక్ సీన్స్ లో నటిస్తూ కనిపించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శలు చేశారు.

కానీ అనుపమ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సినిమాలో ఆమె మొత్తం మూడు లిప్ లాక్ సీన్స్ లో నటించింది. అలానే ఓ ఇంటిమేట్ సీన్ లో కూడా కనిపించింది. అనుపమ ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి కారణం.. ఆమె రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అనుపమ పరమేశ్వరన్ మొత్తం రూ.50 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

నిజం చెప్పాలంటే.. అనుపమ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్. ఒక్కో సినిమాకి పాతిక లక్షల్లోపే రెమ్యునరేషన్ తీసుకునే ఈ బ్యూటీకి యాభై లక్షలు ఆఫర్ చేసేసరికి ఇంటిమేట్ సీన్స్ లో నటించిందని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో కూడా అనుపమ ఇలాంటి సన్నివేశాల్లో నటిస్తుందేమో చూడాలి!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Share.