బుమ్రా పేరెత్తగానే.. అనుపమ మొహం ఎందుకు మాడిపోయింది?

  • July 26, 2019 / 03:01 PM IST

చేసింది తక్కువ సినిమాలే అయినా… యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. త్వరలోనే ‘రాక్షసుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయ్యింది అనుపమ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 2 న విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో.. ప్రమోషన్లు మొదలు పెట్టారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది అనుపమ. గత కొంత కాలంగా టీం ఇండియా క్రికెటర్ బుమ్రాకి.. అనుపమకి మధ్య ఎఫైర్ నడుస్తుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ ‘రాక్షసుడు’ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలో కూడా అనుపమకి ఈ విషయం పై ఓ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె కాస్త అసహనంగా మొహం పెట్టింది. నో కామెంట్ అని మాత్రమే సమాధానమిచ్చింది అనుపమ. మీడియా వారు మాత్రం తగ్గకుండా ఆమె నుండీ సమాధానం రాబట్టాలని ట్రై చేశారు. దీంతో ‘గతంలో బుమ్రాతో కేవలం స్నేహం మాత్రమే ఉండేదని’ చెప్పింది. ఇప్పటికీ బుమ్రా… స్నేహితుడేనా లేక అంతకంటే ఎక్కువా..? అని మీడియా వారు ప్రశ్నించగా… అనుపమ సైలెంట్ అయిపొయింది. ఏదొకటి చెప్పండి అని మీడియా వారు కోరితే.. ‘నో కామెంట్’ అని నవ్వుతూ బదులిచ్చింది. ‘అయితే బుమ్రా పేరెత్తిన సమయంలో అనుపమ పేస్ ఎందుకు మారిపోయింది. ఒకవేళ బుమ్రాతో కనెక్షన్ కట్ అయ్యిందా’ అంటూ ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus