తన అమ్మకి పుట్టినరోజు వేడుక జరిపించిన అనుష్క!

  • July 31, 2018 / 02:15 PM IST

పర్సనల్ లైఫ్ ని, ప్రొఫిషనల్ లైఫ్ ని చక్కగా హ్యాండిల్ చేసే నటీనటుల్లో స్వీటీ అనుష్క ఒకరు. సినిమా షూటింగ్ అయిపోగానే పార్టీలంటూ పబ్ ల చుట్టూ తిరగకుండా ఇంటిపట్టునే ఉండి కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతోంది. సినిమాల ద్వారా వచ్చిన పేరు, ప్రతిష్టలను తన ఇంటి గేటు బయట వదిలి అన్ని మరిచిపోయి సంతోషంగా జీవిస్తుంటుంది. తాజాగా బాహుబలి, భాగమతి వంటి విజయాలతో వచ్చిన క్రేజీని క్యాష్ చేసుకోకుండా.. ఆఫర్లని పక్కన పెట్టి.. తనకిష్టమైన పనుల్లో నిమగ్నమైంది. ఆలయాలను దర్శించుకోవడమే కాకుండా కనిపించే దేవుళ్ళైనా తల్లిదండ్రులను సంతోషపెట్టే పనిలో ఉంది. తాజాగా తన తల్లి పుట్టినరోజు వేడుకను వైభవంగా జరిపింది. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమెతో కేక్ కట్ చేయించింది.

ఈ సందర్భంగా “నువ్వు నా పక్కనే ఉంటే జీవితంలో ఏమైనా సాధించగలను.. హ్యాపీ బర్త్ డే అమ్మా” అంటూ సోషల్ మీడియా వేదికపై పోస్ట్ చేసింది. తల్లిపట్ల తనకి గల ప్రేమను.. ఆమె తనకి ఇస్తోన్న ధైర్యాన్ని ఈ ఒక్క మాటతో అనుష్క వెల్లడించింది. దీంతో ఈ రోజున అనుష్క తల్లి పుట్టినరోజు అని తెలుసుకున్న అభిమానులు .. ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక అనుష్క ప్రొఫిషనల్ లైఫ్ విషయానికి వస్తే భాగమతి తర్వాత అనుష్క గౌతమ్ మీనన్ తో సినిమా చేయాలనీ అనుకుంది. కానీ అది సెట్ కాకపోవడంతో చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సినిమాల విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus