నాకు ఫోజ్ ఎలా ఇవ్వాలో నేర్పింది తనే!

  • November 7, 2017 / 02:30 PM IST

ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు తెలియనివారుండరు. అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఫ్యాన్ బేస్ సంపాదించుకొన్న విరాట్ కోహ్లీ మొన్న తన పుట్టినరోజు సందర్భంగా ఒక సీక్రెట్ ను మీడియాకి లీక్ చేశాడు. అదేదో క్రికెట్ కి సంబంధించిన విషయం అనుకోని కంగారు పడేరు. అది కాస్త పర్సనల్ విషయం లెండి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. విరాట్ కి ఫోటోలకి ఫోజులివ్వడం అస్సల రాదట. ముఖ్యంగా కమర్షియల్ యాడ్స్ షూట్ లో పాల్గొనేప్పుడు చాలా ఇబ్బందిపడేవాడట. అయితే.. తన ప్రియురాలు అనుష్క శర్మ ఆ విషయంలో తనకి చాలా సహాయపడిందట. ఫోటోలకి ఫోజులు ఎలా ఇవ్వాలి మొదలుకొని.. కెమెరా ఫియర్ నుంచి ఎలా బయటపడాలి వంటి విషయాలను అనుష్క అనునిత్యం దగ్గరుండి మరీ నేర్పించ్చిందట.

ఇకపోతే.. త్వరలోనే విరాట్-అనుష్క పెళ్ళి చేసుకోనూన్నారని బాలీవుడ్ వర్గాల విశ్వసనీయ సమాచారం. తమ రిలేషన్ షిప్ ఓపెన్ అయిపోవడంతో ఇటీవల “మాన్యావర్” అనే సంస్థకు ఒక యాడ్ కూడా కలిసి చేశారు. దాంతో.. ఇక వీరు ఎలాగూ పబ్లిక్ అయిపోయారు కాబట్టి త్వరలోనే ఆ మూడు ముళ్ళేవో వేసేస్తే హ్యాపీగా కెమెరాలకు భయపడకుండా చట్టాపట్టాలేసుకొని తిరిగేయవచ్చు. చూద్దాం.. మరి అనుష్క-విరాట్ ల రిలేషన్ షిప్ అందరూ ఊహిస్తున్నట్లుగా పెళ్లి వరకూ వస్తుందో లేక చాలా జంటల మాదిరి పెళ్ళికి ముందే కథ కంచికి చేరుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus