అర్జున్ రెడ్డి కి అనుష్క అభినందనలు!

  • September 7, 2017 / 11:45 AM IST

విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించిన అర్జున్ రెడ్డి మూవీ సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలకు బాగా నచ్చుతోంది. ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ అయితే హీరో హీరోయిన్లతో కలిసి డిన్నర్ కూడా చేశారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చాలామంది తెలుగు హీరోలు “అర్జున్ రెడ్డి” బృందాన్ని ప్రశంసించారు. తాజాగా ఈ సినిమాని చూసిన అనుష్క తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. “అర్జున్ రెడ్డి ని తప్పక చూడండి. అర్జున్ రెడ్డి చిత్ర బృందంలోని ప్రతిఒక్కరికీ నిజాయతీగా.. మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నా.

విజయ్ దేవరకొండ, షాలిని పాండే.. రాహుల్ రామకృష్ణ, ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి అభినందనలు” అని పోస్ట్ చేసింది. భారీ కలక్షన్స్ తో సంతోషపడుతున్న చిత్ర బృందానికి అనుష్క పోస్ట్ మరింత ఆనందాన్ని కలిగించింది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో 1 .5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసి ఓవర్ సీస్ లో అత్యధికంగా కలెక్ట్ చేసిన టాప్ టెన్ తెలుగు చిత్రాల జాబితాలో స్థానం దక్కించుకుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus