ఆగస్టు 6న అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్..!!

Advertisement

అన్నమయ్య, శ్రీ రామ దాసు, షిరిడి సాయి సినిమాల తర్వాత కింగ్ నాగార్జున చేస్తున్నమరో భక్తి రస కథా చిత్రం  “ఓం నమో వెంకటేశాయ”. ఈ సినిమాలో నాగార్జున హథీ రామ్ బాబా పాత్ర పోషించనున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కతున్నఈ మూవీ మొదటి షెడ్యూల్ రీసెంట్ గా పూర్తి చేసుకుంది.

జె.కె. భారవి కథ అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామిగా హిందీ నటుడు సౌరభ్ రాజ్ జైన్, శ్రీదేవిగా విమలా రామన్, భూదేవిగా పావని గంగి రెడ్డి నటిస్తున్నారు. వీరి ఫస్ట్ లుక్ ని రెండు రోజుల క్రితం విడుదల చేశారు. మంచి స్పందన వచ్చింది. ఇందులో నటించిన అనుష్క ఫస్ట్ లుక్ ని ఈనెల 6 న రిలీజ్ చేయనున్నట్లు రాఘవేంద్రరావు వెల్లడించారు. ఈ చిత్రంలో స్వీటీ సన్యాసిగా కనిపించనున్నట్లు సమాచారం. మొదట లోగో, ఆ తర్వాత సౌరభ్ లుక్, రేపు అనుష్క లుక్ .. ఈ విధానం చూస్తుంటే ప్రచారంలో శిష్యుడు ని గురువు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి సినిమా ప్రచారంలో భాగంగా ఎస్.ఎస్. రాజమౌళి సినిమాలోని ఒక్కొక్క పాత్రను మీడియా వారికి రిలీజ్ చేసి సినిమా పై ఆసక్తి పెంచాడు. ఆ రీతిలో ప్రస్తుతం గురువు దర్శకేంద్రుడు ఒక్కొక్క క్యారక్టర్ లుక్ లను విడి విడిగా రివీల్ చేస్తూ క్రేజ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus