అనుష్క విషయంలో కొత్త ట్విస్ట్ ఇచ్చిన ‘ఆర్.ఆర్.ఆర్’ టీం..!

  • October 23, 2019 / 06:29 PM IST

‘భాగమతి’ చిత్రం 2018 .. జనవరి లో విడుదలయ్యింది. అంటే ఏడాదిన్నర పైనే అనుష్క నుండీ మరో చిత్రం రాలేదు. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే చిత్రంలో నటిస్తుంది అనుష్క. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ ఇచ్చింది. ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ పాత్రను పరిచయం చేసే ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రలో అనుష్క కనిపించింది. ఈమె పాత్ర అదుర్స్ అనే చెప్పాలి. దీంతో ‘ఆర్.ఆర్.ఆర్’ లో కూడా అనుష్కతో ఓ గెస్ట్ రోల్ చేయించాలని రాజమౌళి అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎలాగూ రాజమౌళి, అనుష్క లకు మంచి సన్నిహిత్యం ఉంది కాబట్టి అది నిజమే అని అంతా అనుకుంటున్నారు. అయితే ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదట. అసలు రాజమౌళి కి అలాంటి ఆలోచనే లేదట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి సన్నిహితులే తెలియజేశారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుందని సమాచారం.

బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus