‘సైరా నరసింహ రెడ్డి’ చిత్రంలో కీలక పాత్ర పోషించబోతున్న అనుష్క..!

  • February 4, 2019 / 09:03 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 151 వ చిత్రమైన ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో తమన్నా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో అనుష్క ఓ ప్రత్యేక పాత్ర పోషించబోతుందట.

ఈ పాత్ర చిత్రంలో చాలా కీలకమైన పాత్ర కావడంతో … అనుష్క అయితే బాగుంటుందని డైరెక్టర్ సురేందర్ రెడ్డి… ప్రొడ్యూసర్ అయిన రాంచరణ్ తో చెప్పడంతో చరణ్ కూడా అంగీకరించాడట. రాంచరణే స్వయంగా అనుష్కతో మాట్లాడి… ఆమెను ఈ పాత్రకోసం ఒప్పించినట్టు ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ చిత్రంతో పాటు మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో హెరాయిన్ గా కూడా అనుష్క పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఆ చిత్రానికి కూడా చరణ్ ఓ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో అనుష్క.. ‘సైరా’ లో ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకుందని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus