సంచలన నిర్ణయం తీసుకున్న అనుష్క

Advertisement

2018 లో వచ్చిన ‘భాగమతి’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అనుష్క. టాలీవుడ్ లో ప్రస్తుతం ‘లేడీ సూపర్ స్టార్’ అనగానే టక్కున చెప్పే పేరు అనుష్క. చేసిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క. అభిమానులు ముద్దుగా స్వీటీ అని పిలుచుకునే అనుష్క ఇప్పుడు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుందట.

‘అరుంధతి’ ‘బాహుబలి’ ‘భాగమతి’ చిత్రాలతో ఏర్పడ్డ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని.., ఆఫర్ వచ్చిన అన్ని చిత్రాల్లోనూ నటించకుండా కేవలం కధకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలలోనే చేయాలని అనుష్క నిర్ణయించుకుందట. అలా చూసుకుంటే సంవత్సరానికి ఒక చిత్రం మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక రకంగా అభిమానులని నిరాశ పరిచే వార్తే అంటున్నారు ఫిలింనగర్ విశ్లేషకులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus