అనుష్క మళ్ళీ లావైంది.. కారణం ఏంటి..!

  • September 3, 2019 / 05:46 PM IST

టాలీవుడ్ స్టార్ అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే చిత్రంలో నటిస్తుంది. హేమంత్ మధుకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. యుఎస్ లోనే ఈ చిత్రం ఎక్కువ శాతం షూటింగ్ జరిగింది. ఇక తాజాగా ఆ షెడ్యూల్ మొత్తం పూర్తయ్యింది. ‘భాగమతి’ చిత్రం వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంకా ఆమె నుండే మరో చిత్రం రాలేదు. ఇక ఆ చిత్రంలో అనుష్క కాస్త లావుగా కనిపించడంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. దీంతో విదేశాలకు వెళ్ళి సహజ సిద్దమైన వైద్యం తీసుకుని స్లిమ్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక స్వీటీ మళ్ళీ తన గ్లామర్ తో ఆకట్టుకోవడం ఖాయం అని అనుకున్న తరుణంలో ఇప్పుడు మళ్ళీ షాకిచ్చింది.

యూఎస్ లో షూటింగ్ పూర్తి చేసుకుని ఈమధ్యే హైదరాబాద్ కు చేరుకుంది అనుష్క. ఎయిర్పోర్ట్ లో ఆమె బయటకొస్తున్నప్పుడు కొంతమంది ఫోటోలు తీసి.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో అనుష్క ఎప్పటిలాగే లావుగా కనిపించడంతో అందరూ షాకయ్యారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘సైజ్ జీరో’ సినిమా ఎందుకు చేసిందో కానీ అప్పటి నుండీ స్వీటీ వెయిట్ ప్రాబ్లమ్ తో బాధ పడుతూనే ఉంది.ఈ సమస్య ఇలాగే ఉంటే.. భవిష్యత్తులో అనుష్కకి అవకాశాలు తక్కువైపోయే ప్రమాదం ఉంది. అయితే మరో సినిమా కోసం ఇలా మళ్ళీ వెయిట్ పెంచింది అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి అది ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

1

2

3

4

5

Pics Credit: Pinkvilla

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus