అమ్మకి శుభాకాంక్షలు చెప్పిన అనుష్క

  • August 2, 2017 / 07:53 AM IST

బాహుబలితో దేశవ్యాప్తంగా అభిమానులను పెంచుకున్న స్వీటీ అనుష్క అనంతరం మీడియా ముందుకు రాలేదు. ఆమె ప్రస్తుతం అశోక్ దర్శకత్వంలో భాగమతి సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ కూడా బయటికిరాకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. కానీ నిన్న ఆమె చేసిన పోస్ట్ కి ఆనందించారు. ఆగస్టు 1 అనుష్క అమ్మ  ప్రఫుల్లా పుట్టిన రోజు. ఈ సందర్భంగా అమ్మతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “నీకు సరితూగే వారు ఎవరూ లేరు. నీ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు’, ‘అమ్మా! నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను”‘అని అనుష్క తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.

ఈ పోటో ప్రస్తుతం వైరల్ అయింది. అనుష్క పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న భాగమతి ప్రొడక్షన్ పూర్తి చేసుకొని, పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ తర్వాత అనుష్క ఏ చిత్రానికి సైన్ చేయలేదు. ప్రభాస్ సాహో, చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాలలో అనుష్కను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఎందులో ఖరారు అయిందో తెలుసుకోవాలని ఆమె అభిమానులు ఆరాటపడుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus