పోకిరి చెంప చెళ్లుమనిపించిన అనుష్క

  • January 24, 2018 / 11:51 AM IST

అమ్మాయిలు ఇంటి నుంచి కాలు బయటపెడితే ఎన్నో కళ్ళు పరిశీలిస్తుంటాయి. కొంతమంది ఏదోరూపంలో ఆమెను తాకాలని ప్రయత్నిస్తుంటారు. ఇక సెలబ్రిటీ విషయంలో ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. స్వీటీ అనుష్క కి కూడా ఈ చేదు అనుభవం ఎదురైందంట. ఆమె తాజాగా నటించిన భాగమతి ప్రమోషన్లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన అనుష్క ఆ సంఘటనను గుర్తుచేసుకుంది. ” నేను ఓ పబ్లిక్ ఫంక్షన్ కు వెళితే.. ఒకతను నన్ను అసభ్యంగా తాకాలని ప్రయత్నించారు. ఆ క్షణంలో అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. అలా కుదరదు కాబట్టి.. ఆవేశంతో అతని చెంప పగలగొట్టాను.” అని వివరించింది.

ఇలా తన విషయంలోనే కాదు పలువురు తారలు ఇబ్బందులు పడ్డారని అనుష్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా అమ్మాయిలపై లైంగిక దాడుల గురించి మాట్లాడుతూ.. “దేశంలో 60 శాతం మంది అమ్మాయిలు కుటుంబ సభ్యుల ద్వారానే వేధింపులకు గురి అవుతున్నారంటూ రిపోర్ట్ లు వస్తున్నాయి. ఎంతో బాధపడాల్సిన విషయం ఇది. ఆ బాధని బయటికి ఎక్కువమంది చెప్పుకోవడం లేదు. అలాంటి పరిస్థితి ఎదురైతే ధైర్యంగా చెప్పేలా పేరెంట్స్ పిల్లలకు నేర్పించాలి. అప్పుడే వాళ్లు ధైర్యంగా బయటకు వచ్చి చెబుతారు” అని అనుష్క సూచింది. అశోక్ దర్శకత్వంలో అనుష్క నటించిన భాగమతి శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus