బాహుబలి 2లో కత్తి విన్యాసాలు అద్భుతం

  • September 14, 2016 / 07:17 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెర పైన సృష్టించిన కళాఖండం బాహుబలి. ఈ చిత్రం విడుదలై ఏడాది పైనే కావస్తున్నా అందులోని ప్రతి ఫ్రేమ్ సినీ అభిమానుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. అంతగా ఆకట్టుకున్న ఆ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ‘బాహుబలి: ది కంక్లూజన్‌’పైనే అందరి కళ్లున్నాయి. ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు మించి ఉండాలని రాజమౌళి బాహుబలి 2 ని తీర్చి దిద్దుతున్నారు. రెండో భాగంలో రెండు అదిరిపోయే యుద్ధ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలిసింది.

ఆ రెండింట్లోనూ కీలకపాత్ర పోషించేది హీరోయిన్‌ అనుష్క కావడం విశేషం. బాహుబలి 1 లో తల్లి దేవసేనగా సెంటిమెంట్ సీన్లకే పరిమితమైన స్వీటీ బాహుబలి 2 లో యువతిగా, కత్తి విన్యాసాలతో అలరించబోతోంది. ముఖ్యంగా ప్రభాస్‌తో అనుష్క పోరాడే సీన్, రానాతో అనుష్క యుద్ధం చేసే సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలువనుందని చిత్ర బృందం వెల్లడించింది. మొదటి భాగంలో డీ గ్లామర్ గా కనిపించిన అనుష్క, రెండవభాగంలో తన అందం తోను ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus