ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు కొన్ని సమస్యలు తలెత్తుతుంటాయి. ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు అనే విషయంలో గొడవలు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు బాహుబలిలోని తారలు కూడా అదే ఇబ్బందుల్లో ఉన్నారు. ఇందులో స్వీటీ అనుష్క, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొదటి పార్ట్ లో అనుష్క డీ గ్లామర్ గా నటించింది. కంక్లూజన్ లో ఆమెకు మంచి సీన్లు రాసుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. వాటికి తెరకెక్కించాలని ఇప్పుడు అనుకుంటే స్వీటీ బొద్దుగా తయారై చిక్కులు తెచ్చి పెట్టింది.
“జీరో సైజ్” చిత్రం కోసం అనుష్క పెరిగిన బరువు బాహుబలి సీన్లను మింగేసింది. ఆమె కోసం రాసిన సీన్లను పక్కన పెట్టి తమన్నాపై కొత్త సీన్లు షూటింగ్ చేయాలనీ జక్కన్న డిసైడ్ అయిపోయాడు. దీంతో రెండు సినిమాల్లో అనుష్క కనిపించే సీన్ల నిడివి బాగా తగ్గిపోయింది. తక్కువ సీన్లకే పరిమితం కావాల్సిన తమన్నా కంక్లూజన్ లోను ఎక్కువ సేపు కనిపించనుంది. ఈ విషయం తెలిసి అనుష్క తెగ బాధ పడుతోందంట. ఎంత కష్టపడుతున్నా బరువు తగ్గక పోతున్నానని ఆవేదనతో ఉన్న స్వీటీ కి తమన్నా ప్రస్తుతం కొత్త తలనొప్పిగా మారిందని చిత్ర బృందం చెప్పుకుంటోంది.