అనుష్క భాగమతి థియేటర్లోకి ఎప్పుడు వస్తుందంటే?

  • November 17, 2017 / 12:57 PM IST

బాహుబలి సినిమాల తర్వాత అనుష్క చేస్తున్న ఏకైన చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలోగత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆత్రుతని కల్పించింది. దీంతో సినిమా సంక్రాంతికి వస్తుందని అభిమానులు ఆశపడ్డారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు కూడా అప్పుడే రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ పెద్ద పండుగకు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలు థియేటర్లలో పోటీ పడనున్నాయి.

ఆ వార్ సమయంలో భాగమతిని రిలీజ్ చేసి కలక్షన్స్ తగ్గించుకోవడం ఇష్టంలేని నిర్మాతలు సినిమాని అప్పుడు రిలిజ్ చేయడం ఇష్టం లేక గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…” మంచి కథను దర్శకుడు అశోక్ అద్బుతంగా తెరకెక్కించారు. అనుష్క పెర్ పార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్ కానుంది. మథి కెమెరా వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆర్ట్ రవీందర్ వేసిన సెట్స్ గ్రాండియర్ గా ఉంటాయి. తమన్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సన్నివేశానికి బలాన్నిచ్చాయి” అని చెప్పారు.

తెలుగు తో పాటు తమిళం, హిందీలో ఒకే సారి రిలీజ్ కానున్న ఈ చిత్రంలో యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా,  ఉన్ని ముకుందన్ కీలక రోల్ పోషించారు. భారీ విజువల్ ఎఫక్ట్స్ కలిగి ఉన్న ఈ సినిమా అరుంధతి, రుద్రమదేవి తరహాలో అనుష్కకు మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర బృందం భావిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus