భారీ ధర పలికిన భాగమతి తమిళ వెర్షన్ థియేటర్ రైట్స్!

  • November 29, 2017 / 10:33 AM IST

బాహుబలి సినిమా రాజమౌళి, ప్రభాస్ కి మాత్రమే కాదు.. అందులో నటించిన ప్రతి ఒక్కరికీ పేరు తెచ్చి పెట్టింది. అనుష్క కి అభిమానులు రెట్టింపు అయ్యారు. అందుకే బాహుబలి తర్వాత ఆమె చేస్తున్న భాగమతి సినిమాపై భారీ అంచనాలున్నాయి.  అరుంధతి, రుద్రమదేవి, తరహాలో టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆమె పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. అందరి అంచనాలకు మించి భాగమతిగా అనుష్క ఆకట్టుకుంది. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని  పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో పడింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు తో పాటు తమిళం, హిందీలో జనవరి 26 న రిలీజ్ కి ముస్తాబవుతోంది. ఇంకా సినిమా మొదటికాపీ రాకముందే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిపోతోంది. ముందుగా ఈ సినిమా తమిళ థియేటర్ హక్కులను స్టూడియో గ్రీన్ సంస్థ 15కోట్లకు కొనుగోలు చేసిందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. త్వరలోనే తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో తెలియనుంది. ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్న  భాగమతి లో యువ నటుడు ఆది పినిశెట్టి , తమిళ నటుడు ఉన్ని ముకుందన్ కీలక రోల్స్  పోషించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus