భారీ ధరకు అమ్ముడుపోయిన అరవింద సమేత థియేట్రికల్ రైట్స్

Advertisement

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 11 న రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం కష్టపడుతోంది. ఒకే సమయంలో షూటింగ్, డబ్బింగ్ చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు ఇద్దరు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో కనిపించబోతున్నారు. వరుసగా నాలుగు విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఎస్ థమన్ అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

దీంతో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎగబడ్డారు. అన్ని ఏరియాలు కలుపుకొని ఈ మూవీ వందకోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుందని సమాచారం. ఈ వందకోట్లను తొలి వీకెండ్ లోనే రాబడుతుందని ట్రేడ్ వర్గాలవారు భావిస్తున్నారు. నందమూరి అభిమానులు అయితే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఫై రాధాకృష్ణ ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక డ్యాన్స్ చేస్తుందని అంటున్నారు. అది నిజమైతే కలెక్షన్లు పరుగు తీయడం గ్యారంటీ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus