తెలుగు రాష్ట్రాల్లో “అరవింద సమేత” రెండు రోజుల షేర్

  • October 13, 2018 / 06:51 AM IST

తెలుగు ప్రజల మధ్య ఉండే అనుబంధాలను సున్నితంగా చూపించి చప్పట్లు అందుకునే త్రివిక్రమ్… ఈ సారి క్లిష్టతరమైన ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాని తెరకెక్కించి అభినందనలు అందుకుంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అతను తెరకెక్కించిన అరవింద సమేత వీర రాఘవ.. మాస్ క్లాస్ అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటోంది. పూజా హెగ్డే, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు 26 కోట్ల షేర్ రాబట్టి ఔరా అనిపించింది. భారీ ఓపెనింగ్స్ అందుకుంది. రెండో రోజు అదే జోరు కొనసాగించింది. రెండు రోజుల్లో 34 .59 కోట్ల షేర్ వసూలు చేసి ఎన్టీఆర్ సత్తాని చాటింది. కలక్షన్స్ వివరాలు ఏరియాల వారీగా.. కోట్లలో..

ఏరియా : కలక్షన్స్ (షేర్ )
నైజాం : 8.55
సీడెడ్ : 7.44
ఉత్తరాంధ్ర : 4.01 గుంటూరు : 4.82
కృష్ణ : 2.51
ఈస్ట్ గోదావరి : 3.24 వెస్ట్ గోదావరి : 2.69
నెల్లూరు : 1.33
మొత్తం : 34.59

Click Here For Day 1 Collections

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus