సీడెడ్ లో ‘అరవింద సమేత’ మూవీ ఎంత బిజినెస్ చేసిందో తెలుసా ?

  • August 23, 2018 / 07:49 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ ఫస్ట్ కాపీ వచ్చేవరకు డిస్ట్రిబ్యూటర్స్ ఆగడం లేదు. కనీసం షూటింగ్ పూర్తి అయ్యే వరకు ఓపిక పట్టడం లేదు. ఇప్పుడే బేరసారాలు మొదలెట్టేస్తున్నారు. వరుసగా నాలుగు విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో కలిసి మరో హిట్ అందుకోబోతున్నారు. వీరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న “అరవింద సమేత వీర రాఘవ” ఇప్పటికే 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది. దీంతో భారీ ధరకు సీడెడ్ హక్కులను సొంతం చేసుకున్నారు. 15 కోట్లకు కైవశం చేసుకున్నారు.

ఇప్పటివరకు బాహుబలి2 .. 25 కోట్లు, పవన్ అజ్ఞతావాసి 16.20 కోట్లు, చరణ్ రంగస్థలం 15 కోట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో “అరవింద సమేత” నిలిచింది. ఎన్టీఆర్ క్రేజ్ ని బట్టి సులువుగా సీడెడ్ లో 20 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్స్ గా పూజా హెగ్డే, ఈషా రెబ్బ కనువిందు చేయబోతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 11 న థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus