‘అరవింద సమేత’ టీజర్ కట్ లో త్రివిక్రమ్ టీమ్

  • July 7, 2018 / 02:13 PM IST

మాస్ హీరోగా ముద్రపడిపోయిన ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాతో బాలీవుడ్ హీరోలను మించిపోయారు. స్టైలిష్ లుక్ తో క్లాస్ నటనతోను మెప్పించగలను అని నిరూపించారు. రీసెంట్ గా జై లవకుశ సినిమాలో మూడు షేడ్స్ చూపించి ఔరా అనిపించారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్నారు. ఇందులో తారక్ సిటీలో క్లాస్ గాను, సీమలోను మాస్ గాను మెస్మరైజ్ చేయనున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ ఆడియన్స్ ని ఒకే సినిమాతో ఆకర్షించనున్నారు. ఫస్ట్ లుక్ లో సిక్స్ ప్యాక్ లో కనిపించి అంచనాలను అమాంతం పెంచేశారు. ఇక సినిమా టీజర్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో వరంగల్ లో ఓ షెడ్యూల్ జరుపుకోనుంది. త్రివిక్రమ్, ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో బిజీగా ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ అదిరే టీజర్ కట్ చేసే పనిలో దిగనుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా టీజర్ ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఇప్పటి నుంచే షాట్స్ ని సెలక్ట్ చేసే పనిలో పడింది. అందుకు బ్లాస్ట్ అయ్యే నేపథ్యసంగీతాన్ని ఇవ్వడానికి ఎస్ ఎస్ థమన్ రెడీగా ఉన్నారు. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 10 థియేటలో హంగామా చేయనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus