త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలయికలో రూపుదిద్దుకున్న “అరవింద సమేత వీర రాఘవ” మూవీ గత గురువారం రిలీజ్ అయి కలక్షన్ల సునామీ సృష్టించింది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీ తొలి వీకెండ్ లోనే 111 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఔరా అనిపించింది. దసరా సెలవులు కావడంతో వీక్ డేస్ లోను భారీ కలక్షన్స్ సాధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ అరవింద సమేత దూసుకుపోతోంది. ఓవర్సీస్ లో 95 లొకేషన్లో రిలీజ్ అయిన ఈ మూవీ రెండు మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇదివరకు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో మూవీ ఈ ఫీట్ సాధించింది. ఈ మూవీ కూడా 2 మిలియన్ క్లబ్ లో చేరడంతో చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
సినిమా ఇంతటి ఘనవిజయం సాధించినందుకు గాను ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ‘అరవింద సమేత’ విజయోత్సవ సభ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 21న (రేపు) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈ విజయోత్సవ సభ నిర్వహించనున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ జోరు చూస్తుంటే మరిన్ని రికార్డులను బద్దలు కొట్టేలా ఉందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు.