ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీ థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?

Advertisement

వరుసగా నాలుగు హిట్స్ సాధించి ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారు. కాలం కలిసొస్తున్నప్పుడే కలకాలం గుర్తుండే మరిన్ని సినిమాలు చేయాలనీ విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాని చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ అభిమానులకు నచ్చిన ఫ్యాక్షన్ ఫైట్స్.. త్రివిక్రమ్ కి పేరు తెచ్చిన కుటుంబ అనుబంధాలను మేళవించారు. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు, నాగబాబు రెండు ఫ్యాక్షన్ గ్రూపులకు చెందిన నాయకుల పాత్రల్లో నటిస్తున్నారు.

హీరోయిన్స్ గా పూజా హెగ్డే, ఈషా రెబ్బ కనువిందు చేయబోతున్నారు. ఇప్పటికే పూజా హెగ్డేకి సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తి అయింది. ఈషా రెబ్బతో ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ పొలాచ్చిలో షూట్ చేయనున్నారు.  హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రం దసరాకి వస్తుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు చిత్ర బృందం రిలీజ్ డేట్ ని ఖరారు చేసింది. అక్టోబర్ 10(బుధవారం ) న  ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. సో నందమూరి అభిమానులకు ముందుగానే పండుగ రానుందన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus