బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చినవారి వెనుక చాలా పెద్ద కథే ఉంటుంది అని అంటుంటారు. అయితే అన్నిసార్లు అవేంటో తెలియవు. వాళ్లు కూడా చెప్పరు. అలానే బిగ్‌బాస్ లాంఛింగ్ ఈవెంట్ స్టేజీ మీద ఆరియానా తన గురించి పూర్తిగా చెప్పేలేదు. నాగార్జున అడిగినా… నా గతం ఇప్పుడెందుకు సర్ అంటూ దాటేసింది. కానీ గురువారం ఎపిసోడ్లో జరిగిన ‘ఓల్డ్ మెమొరీస్’ వేదికగా చెప్పేసింది. ‘ఆరియానా నీ అసలు పేరు ఏంటి’ అని నాగ్ అడిగితే.. మాట దాటేసింది కదా… ఇప్పుడు చెప్పేసింది.
ఆరియానా గ్లోరీ ఆమె స్క్రీన్ నేమ్. అసలు పేరు అర్చన. ఆరియానా తల్లదండ్రులది ప్రేమ వివాహం. ఆమె ఐదేళ్ల వయసులోనే వారిద్దరూ విడిపోయారు. మగ దిక్కు లేని సంసారం. అయినవాళ్లు కూడా దూరం పెట్టేశారు. తల్లే కష్టపడి ఆమెను పెంచింది. ఆ సమయంలో నేను ఉద్యోగం చేస్తా అంటూ ఆరియానా ముందుకొచ్చింది. 4000 కు ఓ ఉద్యోగంలో చేరింది. అయితే అక్కడి రాజకీయాలతో విసిగిపోయింది. సరైన ఆహారం కూడా దొరికే పరిస్థితి లేదు. తొలుత ఉద్యోగం చేయడానికి ఆమె తల్లి అంగీకరించలేదు. ఆరియానానే ఒప్పించి చేసింది.
‘‘రూ. 1800 కోసం ఈవెంట్లు చేశా. అంతెందుకు రూ. 500 కోసం కూడా చేశా. అలా అలా కష్టపడి ఇంత దూరం ప్రయాణించి బిగ్‌బాస్‌కు వచ్చాను. నా జీవితంలో నా ఫస్ట్ లవ్‌ను మిస్ అయ్యాను. అయితే నేనేంటో నేను తెలుసుకున్నాను. నన్ను నేను కనుక్కున్నాను. ఇప్పుడు మా అమ్మ నా విషయంలో హ్యాపీ. ఇది చాలు’’ అని ఆరియానా అలియాస్ అర్చన తన జీవితం గురించి చెప్పింది.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!