అల్లు అర్జున్ కి నాన్నగా నటించనున్న అర్జున్

  • April 28, 2017 / 09:36 AM IST

సరైనోడు తర్వాత అల్లు అర్జున్ అంతకంటే హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకే హరీశ్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ సినిమా కోసం శ్రమిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ఆడియోని కూడా నెట్లో రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ జూన్ 23 న రిలీజ్ కానుంది. ఇది థియేటర్లోకి రాకముందే నెక్స్ట్ సినిమాని మొదలెట్టనున్నారు. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ నటించనున్నారు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి బన్నీ వాసు కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే పేరును చిత్ర బృందం పరిశీలిస్తోంది.

యంగ్ సోల్జర్ గా అల్లు అర్జున్ నటిస్తున్న ఈ సినిమాలో తండ్రి పాత్రలో అర్జున్ నటిస్తున్నట్లు తెలిసింది. అర్జున్ కూడా గతంలో అనేక దేశభక్తి సినిమాలు చేశారు. ఇది కూడా ఆ జానర్ కావడంతో వక్కంతం వంశీ సీనియర్ నటుడు అర్జున్ ని కలవడం, నటించడానికి ఆయన ఒకే చెప్పడం జరిగిపోయాయని తెలిసింది. ప్రస్తుతం నితిన్ లై మూవీలో నటిస్తున్న అర్జున్, ఈ మూవీ పూర్తి అయిన వెంటనే  ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ టీమ్ తో కలవనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus