అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన అర్జున్ రెడ్డి!

  • February 2, 2018 / 12:40 PM IST

నూతన దర్శకుడు సందీప్ రెడ్డి దర్శకత్వంలో యువ హీరో విజయ్ దేవరకొండ చేసిన సినిమా అర్జున్ రెడ్డి సంచలన విజయం సాధించింది. గత ఏడాది విడుదలయిన ఈ సినిమా వివాదాలను దాటుకుంటూ కలక్షన్ల వర్షం కురిపించింది. ప్రముఖ దర్శకులు వర్మ, రాజమౌళి కి నచ్చిన చిత్రంగా ప్రసంశలు అందుకుంది.    ఐఎండీబీ(ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) వారు 2017 సంవత్సరంలో ప్రజలకు బాగా చేరువైన టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.  అంతేకాదు ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. రీసెంట్ గా మరో అవార్డును బద్దలు కొట్టింది. ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంది.. వాటిని కట్ చేస్తే.. సినిమా చూడలేము.. సినిమా శాటిలైట్ హక్కులు కొంటే బాగా నష్టపోతారు.. అని అనేక అనుమానాలను ఈ చిత్రం తన విజయంతో తిప్పికోట్టింది.

ఈ చిత్రం శాటిలైట్ హక్కులను స్టార్ మా టీవీ వారు కొన్నారు. గత ఆదివారం తొలిసారి ప్రసారం చేశారు. ఎవరూ ఊహించనట్టుగా 13.6 టిఆర్పీ ను సాధించింది.  స్టార్ హీరోలకు సైతం రాని రేటింగ్ రావడంతో విజయ్ దేవరకొండ క్రేజ్ పెరిగిపోయింది. ఈ రెస్పాన్స్ ఛానల్ వారితో పాటు.. చిత్ర బృందానికి ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం విజయ్ గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో సినిమా చేస్తున్నారు. శ్రీరస్తు శుభమస్తుతో హిట్‌ కొట్టిన పరశురామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  కన్నడ బ్యూటీ రష్మికా మందన  హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి “గీతా గోవిందం” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బన్ని వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus