యూరప్ లో అర్జున్ రెడ్డి హల్ చల్

‘ఎన్నో సినిమాలను చేస్తే గాని స్టార్ హీరో ఇమేజ్ రాదు. బాక్స్ ఆఫీస్ హిట్టు రాదు’. ఈ మాటలు ఈ రోజుల్లో ఎక్కువగా వినిపించడం లేదు. ఎందుకంటే మంచి కథకు తగ్గట్టుగా పర్ఫామెన్స్ ఇస్తే స్టార్ హీరో రేంజ్ హోదా తో పాటు బాక్స్ ఆఫీస్ హిట్టు కూడా ఒక్క సినిమాతోనే అందుకోవచ్చు. రీసెంట్ గా అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ ఆ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పకనే చెప్పేశాడు. ప్రస్తుతం మనోడి రేంజ్ మాములుగా లేదు. పడింది రెండు హిట్లే కానీ స్టార్ హీరోల రేంజ్ లో ఇమేజ్ ను తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం చేతిలో అయిదు సినిమాలను ఉంచుకున్నాడు. అర్జున్ రెడ్డి తరువాత గ్యాప్ లేకుండా షూటింగ్ లలో పాల్గొన్నాడు.

అయితే ఫైనల్ గా గ్యాప్ దొరకడంతో విజయ్ విదేశాలకు చెక్కేశాడు. రీసెంట్ గా హైదరాబాద్ లోని కొంత మంది ఫ్యాన్స్ ని కలుసుకొని క్రిస్మస్ గిఫ్ట్స్ ను ఇచ్చి కొంచెం సేపు ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కూల్ గా యూరప్ లోని ప్రముఖ ప్రదేశాలను చుట్టేస్తున్నాడు. ప్రస్తుతం స్పెయిన్ రాజధాని బార్సిలోనా లో రిలాక్స్ అవుతున్నాడు. న్యూ ఇయర్ వేడుకలను విజయ్ అక్కడే సెలబ్రేట్ చేసుకోనున్నాడు. కొన్ని రోజుల వరకు అక్కడే ఎంజాయ్ చేసి ఇండియా వచ్చాక పరశురామ్ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఫైనల్ షెడ్యూల్ ని పూర్తి చేయనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus