అర్జున్ రెడ్డి సూపర్ ప్లాప్ అని చెప్పిన వర్మ!

  • November 9, 2017 / 11:34 AM IST

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తొలి సారి దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బడ్జెట్ కంటే నాలుగింతల కలక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది. ఈ సినిమాపై ప్రసంశలు కురిపించిన ప్రముఖుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమ హద్దులను ఈ మూవీ చెరిపి వేసిందని, వర్ధమాన డైరెక్టర్లకు ఒక గైడ్ గా నిలిచిందని వర్మ ఆకాశానికి ఎత్తేసారు. అంతేకాదు ఇందులో నటించిన విజయ్ దేవరకొండ తెలంగాణ పవర్ స్టార్ అని కితాబు కూడా ఇచ్చారు. అయితే సడన్ గా అర్జున్ రెడ్డి సూపర్ ప్లాప్ అని వర్మ అని ఎందుకు అంటున్నారంటే…  సందీప్ రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ కలిసి ఓ కథను చెప్పారంట.

ఆ స్టోరీ విన్న తర్వాత తన అభిప్రాయాన్ని క్రియేటివ్ గా బయటపెట్టారు. “సందీప్ చెప్పిన కథ విన్న తర్వాత అసూయ పడ్డాను. ఈ కథ మెగా సక్సెస్. ఆ సక్సెస్‌తో పోల్చుకుంటే అర్జున్ రెడ్డి సూపర్ ప్లాప్” అని తనదైన స్టయిల్ లో వర్మ వెల్లడించారు. ఇంకా స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ మూవీ లో ఆర్టిస్టులు ఇతర వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus