పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించిన కాటమరాయుడు సెన్సార్ పూర్తి చేసుకొని ఈనెల 24 న రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గురించి ఆర్ట్ డైరక్టర్ బ్రహ్మ కడలి ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ “ప్రతి సారి పవన్ రాయలసీమకు వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి, అక్కడున్న విధంగా హైదరాబాద్ లోనే ఓ గ్రామం సెట్ వేసాము. ఆ గ్రామం లోనే ఒక శివాలయం కూడా నిర్మించాము” అని వెల్లడించారు. ఇందుకోసం 400 మంది కళాకారులు పనిచేశారని బ్రహ్మ తెలిపారు.
“ఈ శివాలయం కట్టాలంటే కనీసం 20 రోజులు సమయం పడుతుంది. మేము మాత్రం నాలుగురోజుల్లో కంప్లీట్ చేసాం” అని వివరించారు. పవన్ గత చిత్రాలయిన గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలకు బ్రహ్మ కడలి ఆర్ట్ డైరక్టర్ గా పనిచేశారు. తన కళా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ సారి ఎలాంటి మ్యాజిక్ చేశారో మరో పది రోజుల్లో తెలిసిపోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.