Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

కోలీవుడ్‌ హీరో జయం రవి, అతని భార్య ఆర్తి మధ్య గత కొన్ని నెలలుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ విడాకులకు సిద్ధమైన వేళ పుకార్లతో మొదలైన ఈ మాటల యుద్ధం.. ఆ తర్వాత జయం రవి తన స్నేహితురాలు సింగర్‌ కెన్నీషాతో బయటక మీడియాకు ఎదురుపడటంతో తీవ్రంగా మారింది. అయితే గత కొద్ది రోజులుగా వీరి టాక్‌ వార్‌ ఆగింది అనుకుంటుండగా.. మళ్లీ ఇప్పుడు మొదలైంది. తొలుత ట్రోల్స్‌ గురించి జయం రవి మాట్లాడగా.. ఇప్పుడు ఆర్తి ఆ కామెంట్లపై రియాక్ట్‌ అయ్యారు.

Arthi, Jayam Ravi

గత కొన్ని నెలలుగా తనపై వచ్చిన ట్రోల్స్‌ గురించి జయం రవి ఇటీవల స్పందించాడు. మహిళలే కరెక్ట్‌ అని చాలామంది అనుకుంటారు.. కానీ అసలైన బాధితులు పురుషులే అని అన్నాడు. ఎప్పటిలాగే ఆయన కామెంట్లపై అటు మెచ్చుకోలు, ఇటు విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విషయమై ఆర్తి స్పందించారు. ఒకవేళ విడాకులు రాక ముందే నేను వేరే వ్యక్తితో కలిసి ఉంటే? ఇలానే రియాక్ట్‌ అయ్యేవారా. ‘మహిళలే బాధితులు’ అని అంటే ఒప్పుకునేవారా అని ఆర్తి ప్రశ్నించారు.

నాకు తెలిసి అప్పడు నా మాటను ఎవరూ అంగీకరించరు. మరి అదే పని చేస్తూ, ఓ పురుషుడు అదే మాట అంటే ఎలా ఓకే అంటారు? అలాంటివారిని ఎందుకు ప్రశ్నించకూడదు అని ఆర్తి ప్రశ్నించారు. పెళ్లి కాకుండా, మొదటి భార్యతో విడాకులు పూర్తి కాకుండా పురుషుడు అలా తిరగడం సరికాదు. అసలు అది అసహ్యకరమైన ప్రవర్తన అని ఆర్తి తన సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

జయం రవి తన భార్య ఆర్తి నుండి విడిపోతున్నట్లు 2024లో ప్రకటించారు. ఆ సమయంలోనే ఆయన గాయని కెన్నీషాతో బంధంలో ఉన్నారని రూమర్స్‌ వచ్చాయి. తొలుత ఆమె వాటిని కొట్టి పారేసినా జయం రవి దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రారంభోత్సవానికి ఆమె హాజరయ్యారు. దాంతో వారి బంధం బహిర్గతం అయింది అంటూ క్లారిటీ వచ్చేసింది.

 

పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus