అర్జున్ రెడ్డి రీమేక్ లో అల్లు అర్జున్ విలన్!

  • September 20, 2017 / 11:11 AM IST

నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంది. పెళ్లిచూపులు సినిమాలో లేజీ బాయ్ గా నటించి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ ఇందులో అర్జున్ రెడ్డి క్యారక్టర్ లో జీవించారు. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తెలుగు ప్రజలనే కాదు కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్  ప్రజలను సైతం ఆకర్షించింది. అందుకే ఈ చిత్రాన్ని ఆయా భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో హీరో ధనుష్ తన బ్యానర్ ద్వారా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులను కొన్నారు. అతనే హీరోగా నటిస్తారా? మరొకరికి అవకాశం ఇస్తారా? అని అందరూ ఎదురుచూసారు.

ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. వరుడు సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆర్యను హీరోగా ఎన్నుకున్నట్లు సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను .. తమిళంలో ఆర్య అయితే బాగా చేస్తాడని ధనుష్ తో పాటు అక్కడి సినీ వర్గాల వారు భావిస్తున్నారు. ఈ రోల్ చేయడానికి ఆర్య కూడా ఆనందంగా ఒకే చెప్పారు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఇక బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి పాత్రకోసం రన్ బీర్ సింగ్ సిద్దమయ్యారు. కన్నడ రీమేక్ లో యష్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus