మరో హీరోని విలన్ చేసిన బోయపాటి శ్రీను!

  • August 6, 2018 / 01:25 PM IST

హీరోల్ని సరికొత్తగా చూపించడంతో బోయపాటి ఎంతటి సిద్ధహస్తుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అదే సమయంలో హీరోల్ని విలన్లుగా మార్చడంలోనూ ఆయన ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. “లెజండ్” సినిమాతో జగపతిబాబుని, “సరైనోడు” సినిమాతో ఆది పినిశెట్టిని విలన్లుగా సరికొత్తగా పరిచయం చేసిన బోయపాటి శ్రీను తాను రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో ఆల్రెడీ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను విలన్ గా సెలక్ట్ చేసుకోగా.. మరో విలన్ రోల్ కోసం హీరో టర్నడ్ ప్రొడ్యూసర్ ఆర్యన్ రాజేష్ ను ఎంపిక చేసుకొన్నాడని సమాచారం.

నిజానికి అల్లరి నరేష్ కంటే ఆర్యన్ రాజేష్ పెద్ద హీరోగా సెటిల్ అవుతాడని భావించారట స్వర్గీయ ఈవీవీ. ఆయన అంచనాలను తారుమారు చేస్తూ అల్లరి నరేష్ హీరోగా సెటిల్ అవ్వగా.. ఆర్యన్ రాజేష్ నిర్మాతగా మారిపోయాడు. అయితే.. ఇప్పుడు బోయపాటి తన తాజా చిత్రంలో ఆర్యన్ రాజేష్ ను విలన్ గా సరికొత్త రూపం ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేలా చేస్తుండడంతో.. జగపతిబాబు, ఆది పినిశెట్టిల తరహాలో ఆర్యన్ రాజేష్ కూడా నెగిటివ్ రోల్స్ తో యమ బిజీ అయిపోతాదేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus