విజయమ్మ పాత్రలో నటించిన అశ్రిత ఎవరో తెలుసా?

  • January 10, 2019 / 06:47 AM IST

దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసారు. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుత స్పందన లభించింది. ఇక వై.ఎస్ సతీమణి వై.ఎస్.విజయమ్మ లుక్‌ను కూడా తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ పాత్రలో అశ్రిత వేముగంటి నటించారు.దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రంలో అనుష్క వదినగా నటించింది. అలాగే నాని నటించిన ‘ఎం.సీ.ఏ’ చిత్రంలో కూడా నటించింది. ఇక ఈ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. విజయమ్మగా అశ్రిత చాలా బాగా సెట్ అయ్యింది. ఈ పాత్రకు ఈమెను ఎంచుకోవడంలో దర్శకుడి ప్రతిభ ఏంటనేది స్పష్టమవుతుంది. ఇంతకీ ఈమె ఇండస్ట్రీకి ఎలా వచ్చిందో తెలుసా. ఐదేళ్ల వయస్సు నుండే ఈమె కూచిపూడి,భరతనాట్యం లలో శిక్షణ పొందడం మొదలు పెట్టిందట. ఈమె తల్లి గీత ప్రముఖ వైద్యురాలు కావడం విశేషం. తన తల్లి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ లో పనిచేసేది. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మెడికల్ సైన్సెస్ విభాగానికి డీన్ గా పనిచేస్తున్నారు. తండ్రి రమేష్ హైదరాబాద్ లో ఓ ప్రముఖ మేనేజ్ మెంట్ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. 2013లో ఓ ఫంక్షన్ లో నాట్య ప్రదర్శన ఇచ్చినపుడు రాజమౌళి ఈమెను చూసి.. ఈమె టాలెంట్ గుర్తించి తన కొడుకు కార్తికేయ తో ఫోన్ చేయించాడట. వెంటనే అశ్రిత సినిమాల్లో నటించేందుకు ఓకే చెప్పేసి ‘బాహుబలి’ చిత్రంతో సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus