గ్రాండ్ గా అసిన్‌ కుమార్తె తొలి పుట్టినరోజు వేడుక

Advertisement

కేరళ బ్యూటీ ఆసిన్ మాతృభాషలో నటిగా పరిచయమైనప్పటికీ తెలుగు, తమిళంలో అనేక విజయాలు అందుకుంది. తర్వాత బాలీవుడ్ కి వెళ్లి వరుసగా సినిమాలు చేసింది. బిజీగా ఉన్న సమయంలోనే మైక్రోమ్యాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మను 2016లో వివాహం చేసుకుంది. వీరికి 2017లో అరిన్‌ జన్మించింది. అయినా పాప ఫోటోని బయటికి చూపించలేదు. తొలి పుట్టినరోజు సందర్భంగా అసిన్‌, రాహుల్‌ లు కుమార్తె ఫొటోలను సోషల్ మీడియాలో తొలిసారి షేర్‌ చేశారు. “హ్యాపీ బర్త్‌డే అరిన్‌. తనకు ఏడాది నిండింది” అని అసిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. అలాగే రాహుల్‌ కుమార్తె పుట్టినప్పుడు తీసిన ఫొటోను షేర్ చేస్తూ… ‘ఏడాది క్రితం మెరిసిపోయే కళ్లున్న అందమైన లిటిల్‌ ఏంజెల్‌ ఈ ప్రపంచానికి పరిచయం అయ్యింది.

తనకు ఇప్పుడు ఏడాది.. కాలం పరుగులు పెడుతోందా?. నా కుమార్తె అరిన్‌కు హ్యాపీ బర్త్‌డే‌. ఎందుకంత త్వరగా ఎదిగిపోతున్నావ్‌? తొలి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని ట్వీట్‌ చేశారు. అసిన్‌ పుట్టినరోజు కూడా ఈ రోజు (అక్టోబర్ 26 ) కావడంతో అభిమానులు ఆమెకు ఉదయం నుంచి శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు కుమార్తెకు విషెష్ చెబుతున్నారు. పెళ్లి అయిన హీరోయిన్స్.. రీ ఎంట్రీలోను అదరగొడుతున్నారు. అలాగే అసిన్ కూడా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus