కత్తి మహేష్ పై దాడి.. ఆయనకు కావలసింది అదేగా..!

కత్తి మహేష్ కి పబ్లిసిటీ పిచ్చి ఉంది. ఆయన గురించి జనం మరిచిపోతున్నారు అనుకుంటే ఏదో మతం గురించో, మనుషుల గురించో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఫోకస్ లోకి రావాలని చూస్తాడు. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ హిందువులు ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముని ఫేవరెట్ వంటకం జింక మాంసం. సీతా దేవి జింకను తీసుకుని రమ్మని కోరింది.. వండుకుని తినడానికే. రాముడి అంతఃపురంలో చాలామంది వేశ్యలు ఉండేవారు’ అని వ్యాఖ్యానించాడు. దీనితో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. కాగా నేడు ఆయనపై దాడి కూడా జరిగింది.

ఐతే ఇక్కడ కత్తి కి కావలసింది కూడా అదే. ఇలా దాడులు, ప్రతి వాదనలు జరిగినప్పుడే ఆయన కోరుకునే పబ్లిసిటీ తనకు దక్కుతుంది. మంచో చెడో జనాల నోళ్ళలో ఆయన నానుతారు. గతంలో ఇలాగే శ్రీరాముని గురించి చెడ్డగా మాట్లాడి, ఆయన నగర బహిష్కరణకు గురయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ పై తరచుగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అసలు కత్తి మహేష్ ని వెలుగులోకి తెచ్చిందే పవన్ ఫ్యాన్స్. పవన్ సినిమా కాటమరాయుడు సినిమాకు తక్కువ రేటింగ్ ఇచ్చారని ఆయన వాళ్ళు టార్గెట్ చేయడం, దానితో ఆయన టీవీ డిబేట్లలో కూర్చోవడం అలా ఆయన ఫుల్ పాపులారి తెచ్చుకున్నారు. ఈ మధ్య పవన్ పై ఎంత ఘాటు వ్యాఖ్యలు చేసినా అటు వైపునుండి పెద్దగా స్పందన రావడం లేదు. దీనితో కత్తి ఇలా మతాల పైకి తన ఫోకస్ మార్చాడు.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus