నటి దాడి చేసిన ఆమె రూమ్ మేట్.. కేసు నమోదు..!

తాజాగా నటి పై దాడి పై జరగడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే… హిందీలో పలు టీవీ సీరియల్స్ లో నటించి… తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి నళినీ నేగి. తాజాగా ఈమె పై తన రూమ్మేట్ దాడి చేసిందట. ఈ నేపథ్యంలో నళినీ మొహం పై చాలా గాయాలు అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయం ఏమిటంటే .. గతంలో నళినీ, ప్రీతీ అనే అమ్మాయితో కలిసి రూమ్ తీసుకుంది. అటుతరువాత నళినీ సొంతంగా ఫ్లాట్ తీసుకోవడంతో ఆమె అక్కడకి షిఫ్ట్ అయ్యింది.

ఈ క్రమంలో ప్రీతీ మరో చోటికి మారాలని భావించినా.. ఫ్లాట్ దొరక్కపోవడంతో నళినీని సహాయం చేయమని కోరిందట. నళినీ కూడా తన ఫ్లాట్ లో ఉండడానికి ఓకే చెప్పింది. అయితే కొద్దిరోజులు మాత్రమే ఉండడానికి ఓకే నళినీ ఒప్పుకుందట. తరువాత ప్రీతీ తల్లి స్నేహలత కూడా ఫ్లాట్ కు రావడంతో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి.కొన్నాళ్ళు సహనంగా వేచి చూసిన నళినీ… తరువాత తన ఫ్లాట్ నుండి వెళ్లిపోవాలని ప్రీతికి అలాగే తన తల్లికి చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదట. అటుతరువాత వీళ్ళిద్దరూ నళినీ వ్యక్తిగత విషయాల్లోకలుగజేసుకుంటుండడంతో గొడవలు ఎక్కువయ్యేవట. ఇటీవల గొడవ మరింత పెద్దదవడంతో… ప్రీతీ, స్నేహలతలు కలిసి నళినీ మీద దాడి చేశారట. ఈ దాడిలో గాయపడ్డ నళినీ వెంటనే ఒశివారా పోలీస్ పోలీసులను ఆశ్రయించింది. తల్లీ, కూతుర్ల పై కేసు పెట్టడంతో వెంటనే వారు విచారణ చేపట్టారట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus