అవెంజర్స్ దెబ్బకి ఢీలాపడిన జెర్సీ కలెక్షన్స్

  • April 27, 2019 / 04:22 PM IST

ఒక సినిమాకి ఎన్ని ప్రశంసలు దక్కినా, ఎంతమంచి రివ్యూలు వచ్చినా.. ఆ సినిమా సాధించిన కలెక్షన్స్ బట్టే సినిమా రిజల్ట్ ను క్యాల్క్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే నాని తాజా చిత్రం “జెర్సీ” ఇంకా హిట్ కోవలోకి చేరలేదనే చెప్పాలి. ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసల వర్షం కురిపించిన ఈ చిత్రం మొదటివారం కలెక్షన్సే ఆశాజనకంగా లేవని దర్శకనిర్మాతలు బాధపడుతున్న తరుణంలో.. నిన్న విడుదలైన “అవెంజర్స్ ఎండ్ గేమ్” సినిమా సెకండ్ వీక్ కలెక్షన్స్ కి గట్టిగానే గండి కొట్టింది. నిన్న, ఇవాళ “జెర్సీ” చిత్రానికి కనీస స్థాయి కలెక్షన్స్ తీసుకురాలేకపోవడం గమనార్హం.

దాంతో “జెర్సీ” టీం జనాల్ని థియేటర్లకి రప్పించడం కోసం ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అసలే “మజిలీ” కలెక్షన్స్ క్రాస్ చేయలేకపోయామని బాధపడుతున్న టీం మెంబర్స్ ఇప్పుడు సెకండ్ వీక్ కలెక్షన్స్ కి “అవెంజర్స్ ఎండ్ గేమ్” అడ్డురావడంతో ఏం చేయాలో తెలియక బాధపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ఓవర్సీస్ లోనూ “జెర్సీ”కి ఈ హాలీవుడ్ యాక్షన్ హీరోస్ సినిమా గట్టిగానే దెబ్బపడేలా చేసింది. దాంతో రాకరాక వచ్చిన హిట్ సినిమాని సరిగా క్యాష్ చేసుకోలేకపోయానని నాని అండ్ టీం చాలా బాధపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus