సడెన్ గా ఈ చేంజ్ ఓవర్ ఏంటి అవికా..!

  • December 16, 2019 / 05:25 PM IST

‘చిన్నారి పెళ్ళి కూతురు’ అనే హిందీ డబ్బింగ్ సీరియల్ తో తెలుగునాట కూడా మంచి క్రేజ్ ను ఏర్పరుచుకుంది అవికా గోర్. ఆ తరువాత హీరోయిన్ గా మారి ‘ఉయ్యాల జంపాల’ చిత్రం చేసింది. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో వెంటనే ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ‘ఈమె కాస్త లావుగా తయారయ్యిందే’ అనే కామెంట్స్ వినిపించడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.

ఏం వర్కౌట్ లు చేసిందో ఏమో కానీ ఇప్పుడు చాలా సన్నబడి ‘రాజుగారి గది’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఇక అవికా ఈ చిత్రం ప్రమోషన్ల టైంలోనే గ్లామర్ పాత్రలకు నేను రెడీ అనే హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కామెంట్స్ ను నిజం చేస్తూ చిన్న డ్రెస్ వేసుకుంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ‘ఇంత చేంజ్ ఓవర్ ఏంటి అవికా’ ‘చిన్న డ్రెస్ వేసుకున్న చిన్నారి పెళ్ళి కూతురు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ అమ్మడి ఫోటో చూసి దర్శక నిర్మాతలు ఎగబడతారా? లేదా?.. ఈమెకు వరుస ఆఫర్లు వస్తాయా లేదా అనేది చూడాలి..!

1

2

3

4

5

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus