‘చిన్నారి పెళ్ళి కూతురు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అవికా గోర్.. తరువాత హీరోయిన్ గా మారి ‘ఉయ్యాలా జంపాల’ సినిమా చేసింది. ఈ చిత్రం హిట్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ‘లక్ష్మి రావే మా ఇంటికి’ ‘సినిమా చూపిస్తా మావ’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడ’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. అయితే తరువాత ఆమె లావు అయ్యిందనే కామెంట్స్ ఎక్కువ వచ్చాయి.. దీంతో గ్యాప్ తీసుకుని సన్నబడి ఇప్పుడు ‘రాజుగారి గది3’ తో రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక తాజాగా ఆమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆశక్తికరమైన విషయాల్ని తెలిపింది. “నేను ఒక సినిమా వేడుకలో స్కర్ట్ వేసుకుని డాన్స్ వేశాను. ఆ సమయంలో చాలా మంది ట్రోల్స్ చేశారు. నన్ను మొదటిసారి అలా చూడటంతో చాలా మంది వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో నేను బాగా లావుగా ఉన్నానంటూ తీవ్రంగా ట్రోల్స్ కూడా చేశారు. నాపై వచ్చిన ట్రోల్స్ ను నేను పాజిటివ్ గా తీసుకున్నాను. లావు అవ్వడం అనేది నా అనారోగ్య సమస్య కాదు. ఎక్కువ తినడం మరియు బద్దకం కారణంగా వ్యాయామం చేయకపోవడం. నాపై వచ్చిన ట్రోల్స్ తో నేను బద్దకం వదిలేశాను. నేను రాజు గారి గది 3 చిత్రంలో 12 కేజీల బరువు తగ్గి నటించాను.
ఈ సినిమాతో మంచి స్పందన వచ్చినందుకు సంతోషంగా ఉంది. నాపై వచ్చిన ట్రోల్స్ బాగా హెల్ప్ అయ్యాయి. ట్రోల్స్ రాకుంటే నేను బరువు తగ్గాలని అనుకునేదాన్ని కాదు.. దాని వల్ల నా అవకాశాలు తగ్గేవి. ట్రోల్స్ ను సవాల్ గా తీసుకుని నేను సన్నబడ్డాను. ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేసేందుకు కూడా ఓకే. ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రలు ఇచ్చినా చేస్తాను. సన్నబడడంతో నాపై నాకు చాలా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నేను ఎలాంటి డ్రస్ లను అయినా వేసుకోవచ్చు” అంటూ అవికా ట్రోల్ వారి పై వెరైటీ సెటైర్ వేసింది.
బర్త్ డే స్పెషల్ : ప్రభాస్ రేర్ అండ్ అన్ సీన్ పిక్స్…!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?