“దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య” సినిమాల రిజల్ట్స్ ఎఫెక్ట్ అల్లు అర్జున్ పై గట్టిగా పడినట్లుంది. ఆల్రెడీ త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యి ఫస్ట్ సేఫ్ స్టెప్ తీసుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఫిక్స్ చేసి మరో సేఫ్ స్టెప్ వేశాడు. “సరైనోడు” అల్లు అర్జున్ ఆఖరి మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చిన “దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య” సినిమాలో కేవలం ఒక పాట మాత్రమే హైలైట్ అయ్యింది. కానీ.. సరైనోడు సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే.. ఆ సినిమా బీజీయం కూడా అదిరిపోతుంది.
అందుకే.. తన తాజా చిత్రం కోసం తమన్ ని ఫిక్స్ చేశాడు అల్లు అర్జున్. ఈమధ్యకాలంలో వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది తమన్ మాత్రమే. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన మ్యూజిక్ కి మాత్రం మంచి మార్కులు సంపాదించుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కొత్త సినిమాతో మాత్రం సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు అల్లు అర్జున్. మరి ఈ సేఫ్ గేమ్ ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.