ఓవర్సీస్ లో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోన్న “అ!”

  • February 5, 2018 / 06:38 AM IST

నేచురల్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మించిన “అ!” అనే మూవీ ఆది నుంచి అందరినీ ఆకర్షిస్తోంది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎక్కువ మంది స్టార్స్ ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు ఈ సినిమాలో చేప పాత్ర‌కి నాని, చెట్టు పాత్రకి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. సో ‘అ!’ పై క్రేజ్ నెలకొని ఉంది.  ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా “అ!” సినిమా థియేటర్ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేశారు. అందుకే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చిత్రాన్ని 110 కి పైగా లొకేషన్లలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేశారు. తెలుగు సినిమాలు ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్లను సులువుగా వసూలు చేస్తున్నాయి. అ సినిమా తప్పకుండా ఈ మార్క్ ని క్రాస్ చేస్తుందని అక్కడి ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus