మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

పూర్తిగా మేఘాలయలో చిత్రీకరించిన తెలుగు క్రైమ్-కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ (Baa Baa Black Sheep) 2026 అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్‌, టీజ‌ర్‌, రెండు పాట‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ఈ నేప‌థ్యంలో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా.. బా బా బ్లాక్ షీప్ చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా అభినందిస్తూ వీడియో విడుద‌ల చేశారు.

“ఇది మా రాష్ట్రానికి గర్వకారణమైన క్షణం” అని పేర్కొంటూ.. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చలనచిత్రం ఇదేనని, ఇది రాష్ట్ర అందాలను మన కొండలకు ఆవల ఉన్న ప్రేక్షకులకు చేరువ చేస్తుందని ఆయ‌న పేర్కొన్నారు. పొగతో నిండిన మంచు కొండలు, అద్భుతమైన జలపాతాలు, స్వచ్ఛమైన నదులు, సజీవ వేర్ల వంతెనలను ఆయన ప్రస్తావిస్తూ..“మన నేలను ప్రపంచంతో పంచుకునేందుకు సినిమా మరో చక్కని అవకాశం” అని చెప్పారు.

నిర్మాత వేణు దోనేపూడికి, చిత్రాలయం స్టూడియోస్‌కు, నటీనటులకు, సాంకేతిక బృందానికి సంగ్మా అభినందనలు తెలిపారు. “సినిమా చిత్రీక‌ర‌ణ కోసం మేఘాలయ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు, నమ్మకం ఉంచినందుకు, దాని అందాలను వెండితెరపైకి తెచ్చినందుకు ధన్యవాదాలు” అన్నారు. సినిమా నిర్మాణం రాష్ట్ర యువతకు, స్థానిక సమాజాలకు అవకాశాలనిస్తుంద‌ని, వారు తమ ప్రతిభను చాటుకునేందుకు, కొత్త నైపుణ్యాలు నేర్చుకునేందుకు వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. మరింత మంది సినీ నిర్మాతలను రాష్ట్రానికి ఆహ్వానించేందుకు ఎదురుచూస్తున్నామని సంగ్మా పేర్కొన్నారు.

అక్టోబ‌ర్ 9న రిలీజ్ అవుతున్న బా బా బ్లాక్ షీప్ చిత్రం హాస్యం, ఊహించని మలుపులు, వైవిధ్య‌మైన‌ పాత్రలతో ప్రేక్ష‌కులను మెప్పిస్తుంద‌ని సంగ్మా తెలిపారు. “తెరపై మేఘాలయ ప్ర‌కృతి అందాలు ఆకట్టుకున్నప్పుడు, దాని అందాన్ని, సంస్కృతిని, ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వయంగా అనుభవించేందుకు థియేట‌ర్స్‌కు రండి” అని ఆయన అన్నారు.

చిత్ర నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ “మేఘాల‌య రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె. సంగ్మా గారి మద్దతు, ఆద‌ర‌ణ‌కు కృత‌జ్ఞ‌త‌లు. మేఘాలయ ప్ర‌జ‌లు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. అక్క‌డి ప్రకృతి దృశ్యాలు, ఆతిథ్యం ‘బా బా బ్లాక్ షీప్’కు ప్రాణం పోశాయి. ఈ రాష్ట్రంలో మరెన్నో చిత్రాలు తీయాలని ఎదురుచూస్తున్నాం. సంగ్మాగారి ప్రోత్సాహం మా బృందానికి ఎంతో విలువైనది. అక్టోబర్ 9న విడుదలయ్యే ఈ చిత్రం మేఘాలయకు గర్వకారణంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం” అన్నారు.

డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ చిత్రాన్ని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై గుణి మంచికంటి ద‌ర్శ‌కుడిగా వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. అక్టోబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది.

నటీనటులు :

టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, రాజా ర‌వీంద్ర‌, అక్ష‌య్ లగుసాని, విష్ణు ఓయ్‌, కార్తికేయ‌, విస్మ‌య శ్రీ, మాల్వీ మ‌ల్హోత్రా, స‌మృద్ధి ఆర్య‌ల్‌, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా

సాంకేతిక బృందం :

బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత : వేణు దోనేపూడి
సహ నిర్మాత: కొండల్ జిన్నా
దర్శకత్వం : గుణి మంచికంటి
క్రియేటివ్‌ ప్రొడ్యూస‌ర్‌: శ‌్వేత దోనేపూడి
సంగీతం : ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ)
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
కో డైెరెక్టర్ : కిషోర్ కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, శ్రీద దోనేపూడి
కాస్ట్యూమ్స్ : ప్రియాంక శ్రీనివాస్‌
కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్
యాక్షన్స్ : వింగ్ చున్ అంజి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus