మార్చి 26 న బాహుబలి కంక్లూజన్ ఆడియో రిలీజ్ వేడుక

  • March 17, 2017 / 11:01 AM IST

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాకి సంగీతం ప్రాణం. ఎంఎం కీరవాణి అందించిన పాటలు సినిమా విజయానికి దోహదం చేశాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం విజువల్స్ కి బలాన్ని ఇచ్చాయి. ఆ సినిమాకి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ కి కీరవాణి మొదటి పార్ట్ కంటే మంచి ట్యూన్స్ ఇచ్చారని పలు మార్లు రాజమౌళి, ప్రభాస్ చెప్పారు. ఆ పాటలను త్వరలో విననున్నాం. నిన్న ట్రైలర్ ని విడుదల చేసిన చిత్ర బృందం.. ఆడియో రిలీజ్ వేడుకను ఈనెల 26 న వైభవంగా నిర్వహించాలని ఫిక్స్ అయింది.

హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించిన మాహిష్మతి సెట్ నే ఈ వేడుకకు వేదికగా మార్చుకుంది. ఈ కార్యక్రమానికి తరలి వచ్చే అతిథులు, అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పనులను రాజమౌళి భార్య  రమా రాజమౌళి, కీరవాణి భార్య  శ్రీవల్లి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఫంక్షన్ మొత్తం NTV లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus