“బాహుబలి” మేనియా ఇంకా వదలనేలేదు అప్పుడే “బాహుబలి 2” మేనియా స్టార్ట్ అయిపోయింది. ఇంకా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా అప్పుడే ట్రేడ్ పరంగా సంచలనాలు సృష్టిస్తుంది. గతేడాది “బాహుబలి” హిందీ వెర్షన్ రైట్స్ కు 50 కోట్ల రేటు పలికేసరికి ముక్కునవేలేసుకొన్నారందరూ.. అలాంటిదిప్పుడు “బాహుబలి 2” తమిళ రైట్స్ కు దాదాపు 54 కోట్ల రూపాయల భారీ ఆఫర్ రావడంతో ఆశ్చర్యపోవడమే కాదు కళ్ళు తిరిగి కిండపాడుతున్నారంట.
ఓ భారీ తమిళ నిర్మాణ సంస్థ ఈ భారీ మొత్తాన్ని చెల్లించి “బాహుబలి 2” తమిళ రైట్స్ ను దక్కించుకొన్నట్లు సమాచారం. అయితే.. సినిమా రైట్స్ తోపాటు ఆడియో, వీడియో మరియు శాటిలైట్ రైట్స్ కూడా అందులో భాగమాట. షూటింగ్ ఇంక పూర్తవ్వకముందే “బాహుబలి 2” ఈ రేంజ్ లో హల్ చల్ చేస్తుంటే.. ఇక విడుదలయ్యాక అసలు ఈ సినిమాను పట్టుకోగలమా??